JGL: రైతులు వాణిజ్య పంటలను సాగు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలంలోని ఈదుల లింగంపేట, దేశాయిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని మద్దతు ధరను పొందాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట ద్వారా అధిక దిగుబడులు పొందుతారని పేర్కొన్నారు.