SRCL: చందుర్తి మండలం జోగాపూర్లో పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసిన నిందితుడు మ్యాదరి నర్సయ్యను శనివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఈనెల 5న బాధితుడు గొంటి లక్ష్మణ్ నడుచుకుంటూ వెళ్తుండగా నర్సయ్య గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.