KRNL: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఎక్కడైనా కొరత ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవన్నారు.