ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి, జాజులగూడ గ్రామాలలో మాలి సంఘం మండల అధ్యక్షుడు నీకోడే సందీప్ ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఆదివారం ఏర్పాటు చేశారు. జాజులగూడ గ్రామ మాలి సంఘం అధ్యక్షుడిగా వడయ్ సుధాకర్, రణవెల్లి గ్రామ అధ్యక్షుడుగా సెండే పోషన్నలను మాలి కులస్తులు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిల ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.