WNP: CM రేవంత్ రెడ్డిపై శుక్రవారం మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టాలనుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎన్నికలు పెడితే ఓటమి ఖాయమనే దొడ్డిదారిన నియామకాలకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని ఆయన ఆరోపించారు.