KMR: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు అమరులైన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మూతికి నల్లబట్ట కట్టి మౌనం పాటించారు.