NZB: బీజేపీ కిసాన్ మోర్చా శుక్రవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీ జాబితాలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్‌కు చెందిన ఎం. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. మీడియా విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా చందూర్ మండల కేంద్రానికి చెందిన సుమంత్ రెడ్డి నియమితులయ్యారు.