కోనసీమ: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిరస్థాయిగా నిలిచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పి.గన్నవరంలో శనివారం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు వంటి వినూత్న వ్యవస్థలను జగన్ స్థాపించారని కొనియాడుతూ పార్టీ బలోపేతంపై చర్చించారు.