KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) పరీక్షలు కొనసాగుతున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షల్లో 12 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడగా డిబార్ చేసినట్లు శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డి.సురేష్ కుమార్ తెలిపారు. 2వ సెమిస్టర్ పరీక్షలకు 14312 గాను 13370 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు.