MHBD: గూడూరు మండలంలోని చక్రు తండాకు చెందిన లకావత్ ద్వాలి మిర్చి పంటకు కాపలాగా పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఏదో శబ్దం రాగా లేచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఆమె మెడలో ఉన్న రెండు తులాల 5 గ్రాముల పుస్తెలతాడు చూసేసరికి మాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.