VKB: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్ కార్డులు అందజేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 252లోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి అని సూచించారు.