SRCL: సిరిసిల్ల జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.