AP: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో ధరలు భారీగా పడిపోయాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏటా లక్ష టన్నులకు పైగా ఎగుమతి అవుతుండగా యుద్ధం వల్ల సరఫరా ఆగిపోయింది. యుద్ధానికి ముందు రూ.20,000-23,000 పలికిన టన్ను ఇప్పుడు రూ.6,000-8,000 మధ్య ఉంది. నాణ్యతను బట్టి వ్యాపారులు రూ.4,000-5,000 ఇస్తున్నారని, పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.