NLG: జిల్లాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ప్రజలు స్వయంగా వెబ్సైట్ ద్వారా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి జనాభా గణన జరుగుతుందని అధికారులు తెలిపారు.