SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడులో గ్రామస్తులు మానవత్వం చాటారు. ఇటీవల మరణించిన యూసుఫ్ పిల్లల భవిష్యత్తు కోసం రూ. 4,05,081 విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని చిన్నారుల పేరిట పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వివిధ సంఘాలు, గ్రామస్థులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఆపదలో ఉన్న బిడ్డలను ఆదుకోవడంలో పొనుగోడు ప్రజలు చూపిన చొరవ అందరికీ స్ఫూర్తిదాయకం.