AP: CM చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డు రావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలో, పాలనలో వేగాన్ని పెంచడంలో చంద్రబాబుకు ఉన్న దూరదృష్టిని ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒక అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో సీఎం కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు.