AP: టోల్గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం MLA అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్గేట్ సిబ్బందిపై దాడికి దిగిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె-తిరుపతి రహదారిపై గండబోయినపల్లె వద్ద టోల్గేట్ సిబ్బందితో నిన్న ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదం దిగి, దాడికి పాల్పడ్డారు.