శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో జనాభా లెక్కల రెండో విడత శిక్షణ పూర్తయింది. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించి అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేశ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొని ప్రక్రియను పర్యవేక్షించారు. ఉపాధ్యాయ బృందం చురుకుగా పాల్గొని వివరాల సేకరణపై శిక్షణ పొందిందాని తెలిపారు.