KMM: సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఖమ్మం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు వినూత్నంగా వ్యవహరించారు. తన కుమార్తె వివాహ పత్రికపై సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలను ముద్రించి బంధుమిత్రులకు సామాజిక సందేశాన్ని ఇచ్చారు. ఆహ్వానంతో పాటు అవగాహన కల్పిస్తున్న ఆయన బాధ్యతను చూసి అధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు.