HYD: సైబర్ టవర్స్ వద్ద- శిల్పారామం ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు, లేన్ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రయాణికుల నుంచి మీటర్ ప్రకారం సరైన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని, సురక్షితమైన ప్రయాణం అందరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.