SRPT: నేరేడుచర్ల మండలం జానుపహాడ్ కాలువపై ఉన్న వంతెన రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా మారింది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల రైతులకు ఈ వంతెన కీలకమైనది. 555 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్న సమయంలో దీనిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.