WGL: మక్క రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాగు బాగా వచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, నిబంధనల పేరుతో పరిమితులు విధించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి రాగా ప్రభుత్వం 26.5 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మిగిలిన పంటను ప్రైవేటుగా అమ్మితే నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.