NZB: నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో టీబీ రహిత గ్రామంగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎంహెచ్ రాజశ్రీ చేతుల మీదుగా సర్పంచ్ ఈర్పు మహేష్, కార్యదర్శి ఉపేందర్ ఈ అవార్డును స్వీకరించారు. ఆశా వర్కర్ల అంకితభావం, గ్రామ ప్రజల సేవాభావంతో ఈ విజయం సాధ్యమైందన్నారు.