NDL: శ్రీశైలం ఆలయ వెబ్సైట్ ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓ ప్రకటనలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ విశేషాలు, సౌకర్యాల సమాచారం ఆన్లైన్ అందుబాటులో ఉంచాలని ఈవోను ఆదేశించారు. దీనివల్ల సమాచార సేకరణ భక్తులకు మరింత సులభతరం కానుంది.