TG: రాష్ట్రంలో మరో మూడు రోజులు భానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. ఇవాళ్టి నుంచి 28 వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.