రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ చిత్రీకరణపై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం కేరళ అడవుల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఆధ్వర్యంలో 15 రోజుల పాటు భారీ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో హైలెట్గా నిలవనున్నాయి.