MLG: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురం గ్రామానికి చెందిన కందడి సంతోష్ రెడ్డి నియామకం పొందారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీలో ఐటీ సెల్ కన్వీనర్‌గా ఎంపికయ్యారు. పార్టీ ప్రకటించిన తాజా జాబితాలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.