TG: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. HYDలోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు KCR అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు హాజరు కానున్నారు.