GT విసిరిన 206 రన్స్ లక్ష్యఛేదన ఆఖరి దశలో RCB తడబడుతోంది. ఆరంభంలోనే బెథెల్ వికెట్ పడినా.. పడిక్కల్(55), కోహ్లీ(81) రెండో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయినప్పటికీ RCB 13-16 ఓవర్ల మధ్య ఓవర్‌కి 1 చొప్పున పడిక్కల్, కోహ్లీ, పాటీదార్(8), జితేష్(10) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమ్ స్కోర్ 175/5 కాగా.. విజయం కోసం 24 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది.