TG: ప్రభుత్వంలో RTC విలీన ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా RTC సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టంచేశారు.