WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన ఉడుతల సుధాకర్ (తండ్రి) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. గతంలోనే ఆయన భార్య ఉడుతల మౌనిక కూడా మృతి చెందగా, తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఇద్దరు కుమారులు శివ (6వ తరగతి), హన్సిక్ (3వ తరగతి) అనాథలుగా మారారు. పేద కుటుంబానికి చెందిన ఈ చిన్నారులను దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.