TG: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ మంచిర్యాల(D)లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని 85.10 ఎకరాల భూమిని మత్స్య శాఖకు కేటాయించింది. ఈ పార్క్ ద్వారా చేపల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతుల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.