ADB: బోథ్ మండలం పట్నాపూర్ గ్రామంలో బడిబాటను ఎంపీడీవో రమేష్, సర్పంచ్ సుగుణ నిర్వహించారు. బడీడు పిల్లలందరిని తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫారం సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు.