SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో జనాభా లెక్కల స్వీయ గణన–2027 కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ పిల్లి బాబు ప్రథమంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూపర్వైజర్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, జీపీఓ బాలకృష్ణ, ఎన్ఆర్ఈజీఎస్ మేట్ గుడిపాక శంకర్ పాల్గొన్నారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించాలన్నారు.