SRCL: కేసులలో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేవిధంగా కృషి చేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పిల్లల రక్షణ, డ్రగ్స్ అడ్డుకట్టపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.