NRPT: నర్వ మండలంలో ఈనెల 28న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సమ్మేళన సమితి సభ్యులు గ్రామగ్రామాన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.