ADB: రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ. 40 వేలు వసూలు చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు CI నాగరాజు ఆదివారం తెలిపారు. పూసాయి గ్రామానికి చెందిన సంతోష్ అనే బాధితుడు నుంచి దేవేందర్, ముజీబ్, చంద్రకాంత్ అనే నిందితులు డబ్బులు వసూలు చేశారన్నారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని CI హెచ్చరించారు.