TG: BRS పార్టీ ఆవిర్భవించి ఇవాళ్టితో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు, అభిమానులకు ఉత్సాహాన్నిచ్చేలా మెసేజ్ ఇచ్చారు. ‘నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా’ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు చేరుకోవడం ఒక మహోజ్వల ఘట్టమని పేర్కొన్నారు.