AP: HYD నుండి పాలకొల్లు వెళ్తున్న ‘వర్మ ట్రావెల్స్’ బస్సు డ్రైవర్ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలేశాడు. బస్సులో డీజిల్ అయిపోయిందని చెప్పి డ్రైవర్ పరారవ్వడమే కాకుండా, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీనిపై ట్రావెల్స్ యజమానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.