TG: నాన్వెజ్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ భర్తను భార్య హత్య చేసేవరకు వెళ్లింది. కామారెడ్డికి చెందిన శివాజీ(31) శనివారం రాత్రి నాన్వెజ్ ఎందుకు వండలేదని భార్య లక్ష్మీపై కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆగ్రహంతో లక్ష్మీ ఇంట్లో ఉన్న కొడవలితో శివాజీ మెడపై వేటు వేసింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.