‘కర’ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని హీరో ధనుష్ చెప్పాడు. ‘ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా. అసాధారణ సమస్యలను ఎదుర్కొనే ఓ సామాన్యుడి కథ ఇది. దర్శకుడు విఘ్నేశ్ నాకు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించారు. భవిష్యత్తులో ఆయన పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది, కచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుంటుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.