KKD: జిల్లాలోని ఆయిల్, రసాయన పరిశ్రమలలో ఈనెల 30న విపత్తు నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధర ప్రసాద్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా సిబ్బందిని సన్నద్ధం చేయడమే లక్ష్యం అన్నారు.