MBNR: రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ రాష్ట్ర నూతన వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా మహబూబ్‌నగర్ వచ్చారని అధికారులు తెలిపారు. పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లోనే చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.