MNCL: అన్ని మండల కేంద్రాలలో నిర్వహించే నేతకానిల నిరసన ర్యాలీని అందరూ విజయవంతం చేయాలని ఎస్సీటీ చైర్మన్, టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత కోరారు. ప్రభుత్వం కులాల వారీగా జనాభాను పొందుపరుస్తూ విడుదల చేసిన జనాభా గణాంకాలలో నేతకానిలకు అన్యాయం జరిగిందన్నారు. ఏప్రిల్ 30న అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా చేసి వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు.