NRML: భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలీస్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. భైంసా డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా కలిసి అర్జీలు అందించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.