భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సమస్యలు కూడా తోడవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండగా, బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయి. అధికారులు కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రాక్టికల్‌గా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, వినియోగదారులు వాపోతున్నారు.