NGKL: ప్రముఖ రచయిత రావులపాటి సీతారాంనకు చింతలపల్లి నారాయణరావు-నిర్మలాదేవి స్మారక పురస్కారం అందజేయనున్నట్లు జిల్లా రచయితలు తెలిపారు. ఆదివారం పట్టణంలో కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు. ఏప్రిల్ 30న హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో జరిగే పురస్కార ప్రదానోత్సవానికి జిల్లా రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.