KMR: దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోర్ తవ్వకం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ జనగామ నరేష్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందుకూరి ప్రభాకర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు