సిరీస్ డిసైడర్ మూడో T20లో సౌతాఫ్రికా వికెట్లు పడగొట్టేందుకు భారత మహిళా జట్టు చెమటోడుస్తుంది. ప్రొటీస్ కెప్టెన్ లారా 76*, లూస్ 39* ధాటిగా ఆడుతుండటంతో.. ఒక్క వికెట్ అయినా పడదా? అన్నట్లుగా తన అమ్మాయిలు ప్రయత్నిస్తున్నారు. 11 ఓవర్ల ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 128 కాగా.. విజయం కోసం 54 బంతుల్లో 66 రన్స్ చేయాలి. ఇందులోనూ ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది.