TG: రాష్ట్రంలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత అవసరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిభ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదని, దాతలు ముందుకొచ్చి స్కాలర్షిప్ అందించడంతో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ 5050 మంది తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం గొప్ప విషయమని కొనియాడారు.